: అంబులెన్స్ కి అడ్డం వస్తే రూ.రెండు వేలు జరిమానా


ఢిల్లీలో అంబులెన్స్ కి అడ్డం వచ్చినా, లేక దాని ప్రయాణానికి ఆటంకం కలిగించినా 2000 రూపాయలు జరిమానా విధించనున్నారు. ఈ మేరకు ఢిల్లీ స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ముక్తేశ్ చందర్ ఆదేశాలు జారీ చేశారు. తమ అంబులెన్స్ ను ఎవరైనా నిలువరించినట్టు తగిన ఆధారాలతో ఆసుపత్రుల యాజమాన్యాలు ఫిర్యాదు చేయవచ్చని ఆయన వెల్లడించారు. వాస్తవాలు విచారించి బాధ్యులను శిక్షిస్తామని ఆయన తెలిపారు. గరిష్ఠంగా 2000 రూపాయల జరిమానా విధిస్తామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News