: ఢిల్లీ-లాహోర్ 'దోస్తీ' బస్సు వాఘా బోర్డర్ వరకే!


భద్రత కారణాల రీత్యా ఢిల్లీ-లాహోర్ మధ్య నడుపుతున్న 'దోస్తీ' బస్సును తమ దేశంలోకి రానిచ్చేందుకు నేటి ఉదయం పాకిస్తాన్ అంగీకరించలేదు. ఉగ్రదాడులు జరగవచ్చని అనుమానాలు వ్యక్తం చేసిన పాకిస్తాన్ టూరిజం అభివృద్ధి సంస్థ, ఇకపై బస్సును వాఘా సరిహద్దు వరకే నడుపుతామని ప్రకటించింది. దీంతో, పాకిస్తాన్ నుంచి సరిహద్దు వరకూ వచ్చిన ప్రయాణికులు మరో బస్సులో ఢిల్లీ, అమృతసర్ నగరాలకు వెళ్ళాల్సి వచ్చింది. మరోవైపు, ఢిల్లీ నుంచి బయలుదేరిన ప్రయాణికులు సైతం వాఘా వద్ద సరిహద్దు దాటి పాక్ ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణాన్ని కొనసాగించారు. 1999 మార్చి 16న 'దోస్తీ' బస్సు సేవలు ప్రారంభం కాగా, ఇలా సరిహద్దుల వద్ద ఆగిపోవడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News