: చిన్నారిని వేధించిన ఉపాధ్యాయుడు... రణరంగమైన స్కూల్
పశ్చిమ బెంగళూరు పరిధిలోని ఓ ప్రైవేటు స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడు ఏడేళ్ళ చిన్నారిని లైంగికంగా వేధించాడంటూ మొదలైన గొడవ చిలికి చిలికి గాలివానలా మారింది. చుట్టుపక్కల ఉన్న అల్లరి మూకలు చేరి ఆ స్కూల్ ఫర్నిచర్ ను, ఆవరణలోని వాహనాలనూ తగులబెట్టాయి. కొద్ది సంఖ్యలో ఉన్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేయడంలో విఫలం కాగా, తదుపరి అల్లర్లు శ్రుతిమించడంతో 4 ప్లాటూన్ల బలగాలను రంగంలోకి దించాల్సి వచ్చింది. అప్పటికీ అల్లర్లు తగ్గకపోవడంతో పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించి లాఠీచార్జ్ చేశారు. ఆ ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాలంటూ నిరసనకారులు పెద్దగొడవే చేశారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఎవరినీ అనుమతించబోమని హెచ్చరించిన నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్.రెడ్డి పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి టీచర్ ను అరెస్ట్ చేశామని తెలిపారు.