: సెంచరీ మిస్సైనా విమర్శలే!


సాధారణంగా ఓ బ్యాట్స్ మన్ 50కి పైగా పరుగులు సాధిస్తే రాణించాడని అంటాం. సెంచరీ కొడితే అద్భుతంగా ఆడాడని కితాబిస్తాం. ఇక, 81 పరుగులు చేస్తే మెరుగ్గా ఆడినట్టు భావించాల్సిందే. కానీ, ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. టీమిండియాతో చివరి టెస్టులో అతడు తొలి ఇన్నింగ్సులో 81 పరుగులు చేసి అవుటయ్యాడు. దీనిపై విమర్శలు రేగాయి. గాయం కారణంగా కొద్దికాలం క్రికెట్ కు దూరమై, కోలుకున్న వాట్సన్ చాన్నాళ్ల తర్వాత మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, మాజీ క్రికెటర్ టామ్ మూడీ... వాట్సన్ షాట్ల ఎంపికను తప్పుబట్టాడు. వాట్సన్ వంటి అనుభవజ్ఞుడు ఆడాల్సిన షాట్ కాదని మూడీ అన్నాడు. రెండో రోజు ఆటలో వాట్సన్... షమి బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అలాంటి చెత్త షాట్ ఎందుకు ఆడాడో అర్థం కాలేదని మూడీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News