: బాలుడ్ని బలిచ్చేందుకు విఫలయత్నం
కాలం మారినా ప్రజల్లో మూఢనమ్మకాలు పోలేదు. సైన్సుతో ఎంతో అభివృద్ధి సాధించినా, ఎవరో చెప్పే గాలి కబుర్లకే తొలి ప్రాధాన్యతనిస్తున్నారు. అందుకు నిదర్శనంలా... కర్నూలు జిల్లా పత్తికొండ చాకలివీధిలో అన్నెం పున్నెం తెలియని బాలుడిని బలి ఇచ్చేందుకు విఫలప్రయత్నం జరిగింది. స్థానికులు వారి యత్నాన్ని గమనించి భగ్నం చేయడంతో దుండగులు పరారయ్యారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని ఓ దాబాలో పనిచేస్తున్న బాలుడిని దుండగులు బలిచ్చేందుకు తీసుకురాగా స్థానికులు కాపాడి పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఆ బాలుడ్ని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.