: రామ మందిరాల నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరంటున్న ముస్లిం నేత


సమాజ్ వాదీ పార్టీ ఎంపీ చౌధరీ మునవ్వర్ సలీం దేశంలో రామ మందిరాలు నిర్మించడాన్ని సమర్థించారు. రామ మందిరాలను భారత్ లో కాకపోతే మరెక్కడ నిర్మిస్తారని ప్రశ్నించారు. మందిర నిర్మాణాలను ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లోని విదిశ ప్రాంతానికి చెందిన సలీం 2012లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇటీవలే ఆయనను పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ యూపీలోని అజాంగఢ్, హత్రాస్, ఇటా జిల్లాలకు ఇన్ చార్జ్ గా నియమించారు.

  • Loading...

More Telugu News