: లఖ్వీ జైల్లో ఉండాల్సిందే: స్పష్టం చేసిన పాక్ సుప్రీంకోర్టు


ముంబయి ఉగ్రదాడుల వెనకున్న మాస్టర్ మైండ్ జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ ఎట్టి పరిస్థితుల్లో జైలు గోడలను దాటి బయట ప్రపంచంలో అడుగుపెట్టడానికి వీల్లేదని పాకిస్థాన్ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో, లఖ్వీకి బెయిల్ మంజూరు చేసిన కింది కోర్టు తీర్పును కొట్టివేసింది. ముంబయి దాడులకు లఖ్వీనే కారణమని నిర్ధారించడానికి సరైన ఆధారాలు లేవంటూ... డిసెంబర్ లో పాక్ లోని ఓ 'యాంటీ టెర్రర్' కోర్టు లఖ్వీకి బెయిల్ మంజూరు చేసింది. దీనిపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు ప్రపంచ దేశాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. దీంతో, బెయిల్ పై పాక్ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. దీన్ని విచారించిన పాక్ సుప్రీంకోర్టు లఖ్వీని జైల్లోనే ఉంచాలంటూ తీర్పును వెలువరించింది.

  • Loading...

More Telugu News