: అనంతపురం బస్సు ప్రమాద మృతులకు చిరంజీవి సంతాపం


అనంతపురం జిల్లా మడకశిర వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి స్పందించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన, చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. మృతి చెందిన ఒక్కొక్కరికీ రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటు ప్రమాదంపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు హరికృష్ణ కూడా తన సంతాపం ప్రకటించారు.

  • Loading...

More Telugu News