: మిషన్ కాకతీయకు తొలి విడత నిధులు: టీ సర్కారు ఉత్తర్వులు జారీ


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు తొలి విడత నిధులు విడుదలయ్యాయి. మిషన్ కు రూ.67 కోట్లు విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కుంటలు, చెరువులను అభివృద్ధి చేసి రాష్ట్రంలో జల వనరులను పెంచడం కోసం ప్రభుత్వం మిషన్ కాకతీయను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద రాష్ట్రంలోని అన్ని చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి వర్షపు నీటిని వృథాగా పోనీయకుండా నిలువ చేస్తామని కేసీఆర్ సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి చెబుతూ వస్తోంది. తొలి విడతగా రూ.67 కోట్లను విడుదల చేసిన ప్రభుత్వం, మలి విడతలో భారీ ఎత్తున నిధులను మంజూరు చేయనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

  • Loading...

More Telugu News