: అరుదైన రికార్డుతో బ్రాడ్ మన్ సరసన స్మిత్
ఇండియాతో జరుగుతున్న నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ స్టీవెన్ స్మిత్ అరుదైన రికార్డు సాధించాడు. స్మిత్ వరుసగా నాలుగు సెంచరీలు చేసి ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్ మన్ గా నిలిచాడు. గతంలో బ్యాటింగ్ దిగ్గజం డాన్ బ్రాడ్ మన్, దక్షిణాఫ్రికాకు చెందినా కలిస్ లు మాత్రమే నాలుగు వరుస సెంచరీలు చేశారు. ఈ సిరీస్ నాలుగో టెస్టులో నేడు సెంచరీ బాదిన స్మిత్ (117), అంతకుముందు అడిలైడ్ టెస్టులో (162 నాటౌట్), బ్రిస్బేన్ లో (133), మెల్ బోర్న్ టెస్టులో (192) శతకాలు నమోదు చేశాడు.