: బస్సు ప్రమాదంపై స్పందించిన ప్రధాని


ఈ ఉదయం అనంతపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దీన్ని అత్యంత దురదృష్టకర సంఘటనగా ఆయన అభివర్ణించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. గాయపడిన వారు సత్వరం కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు వివరించారు. కాగా, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్సు డ్రైవర్ మృతి చెందినట్టు తెలిసింది. మరోవైపు గాయాలతో ఆసుపత్రులలో ఉన్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

  • Loading...

More Telugu News