: తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలు: జాబితాపై కేసీఆర్ కసరత్తు
ఏపీలో 35 మందికి పైగా సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగి 24 గంటలు కూడా గడవలేదు... తెలంగాణలోనూ ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీలకు రంగం సిద్ధమైంది. ఏపీ కంటే భారీ స్థాయిలో అధికారుల బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అధికారుల బదిలీల జాబితా దాదాపుగా సిద్ధమైందని, తుది జాబితాకు సీఎం కేసీఆర్ మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘకాలంగా తేలని ఐఏఎస్, ఐపీఎస్ విభజనను ఎట్టకేలకు కేంద్రం పూర్తి చేసిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు అధికారుల బదిలీలకు తెరతీశాయి.