: నాథురాం గాడ్సే కోసం హిందూ మహాసభ బైక్ ర్యాలీ


దేశ వ్యాప్తంగా నాథురాం గాడ్సేకు ప్రచారం కల్పించాలని హిందూ మహాసభ కంకణం కట్టుకుంది. ఈ మేరకు రేపు లక్నోలో బైక్ ర్యాలీ నిర్వహించాలని ప్రణాళిక వేస్తోంది. జాతిపిత మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందన్న విషయంపై ఈ ర్యాలీ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నించనుంది. ర్యాలీ సమయంలోనే ఓ స్థానిక గ్రామంలో గాడ్సే విగ్రహం ప్రతిష్ఠించాక 'భూమి పూజన్'ను నిర్వహించనున్నట్లు హిందూ మహాసభ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలేష్ తివారీ తెలిపారు. దేశ వ్యాప్తంగా గాడ్సే విగ్రహాలు ప్రతిష్ఠించాలని హిందూ మహాసభ అనుకుంటోంది.

  • Loading...

More Telugu News