: బీజేపీలో చేరిక వార్తలను ఖండించిన కిరణ్ కుమార్ రెడ్డి
బీజేపీలో చేరబోతున్నారనే వార్తలను ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో తాను బీజేపీ తీర్థం పుచ్చుకుంటాననే వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. కొన్ని పత్రికల్లో ఇలాంటి వార్తలు వస్తున్నాయని... తాను ఏనాడూ దీనికి సంబంధించిన ప్రకటనలు చేయలేదని... ఈ వార్తలను నమ్మవద్దని కిరణ్ తెలిపారు. గత కొంతకాలంగా... కిరణ్ బీజేపీలో చేరుతున్నారనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి.