: భారత్ రానున్న ఐరాస సెక్రటరీ జనరల్


ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ ఈ వారంలో భారత్ రానున్నారు. దేశంలో అభివృద్ధిపై ఆయన నేతలతో చర్చలు జరుపుతారు. ఈ మేరకు బాన్ కీ మూన్ ప్రతినిధి స్టెఫానీ డుజారిక్ వివరాలు తెలిపారు. జనవరి 10న ఆయన గుజరాత్ వెళతారని, అక్కడ 'వైబ్రాంట్ గుజరాత్' సదస్సులో ప్రసంగిస్తారని పేర్కొన్నారు. ఈ సదస్సులో బాన్ కీ మూన్ ప్రపంచ నేతలను, సిద్ధాంతకర్తలను, వాణిజ్య వర్గ ప్రతినిధులను ఉద్దేశించి ఉపన్యసిస్తారని డుజారిక్ ఓ వార్తా పత్రికకు తెలిపారు. జనవరి 13న ఆయన పర్యటన ముగుస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News