: రోడ్డు ప్రమాద వార్త కలచి వేసింది: జగన్
అనంతపురం జిల్లా మడకశిర వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రమాద వార్త తనను కలచి వేసిందని చెప్పారు. ప్రమాదంలో పిల్లలు సహా అనేక మంది చనిపోవడం తీవ్ర ఆవేదనకు గురి చేస్తోందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. అటు గాయపడిన వారికి కూడా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో 20 మంది వరకు చనిపోయినట్టు సమాచారం.