: అనంతపురం బస్సు ప్రమాద మృతులకు ఎక్స్ గ్రేషియా
అనంతపురం జిల్లాలో పెనుకొండ-మడకశిర మార్గం వద్ద చోటుచేసుకున్న ఆర్టీసీ బస్సు ప్రమాద మృతులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష ఇవ్వనున్నట్టు తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయాలైన వారిని బెంగళూరు ఆసుపత్రికి, స్వల్ప గాయాలైన వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా చనిపోయినవారిలో ఎక్కువమంది విద్యార్థులే ఉన్నారని తెలిసింది. అటు ప్రమాద ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.