: చంద్రబాబు దిగ్భ్రాంతి... ఘటనా స్థలికి వెళ్లాలని మంత్రులు సునీత, పల్లె, సిద్ధాకు ఆదేశం


ఈ ఉదయం అనంతపురం జల్లాలోని మడకశిర వద్ద జరిగిన 'పల్లె వెలుగు' బస్సు ప్రమాదంలో 20 మంది మరణించినట్టు సమాచారం. మరో 20 మంతి తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. అంతేకాకుండా, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. దీనికి తోడు, రాష్ట్ర మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, సిద్ధా రాఘవరావులను ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.

  • Loading...

More Telugu News