: నేడు ప్రవాస భారతీయ దివస్ ప్రారంభం... ముగింపు వేడుకలకు రాష్ట్రపతి
13వ ప్రవాస భారతీయ దివస్ నేడు గుజరాత్ రాజధాని గాంధీనగర్ లో ప్రారంభం కానుంది. విదేశాల్లోని భారతీయులకు సంబంధించిన కార్యక్రమంగా 13 ఏళ్లుగా దీనిని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తోంది. మూడు రోజుల పాటు గాంధీ నగర్, అహ్మదాబాద్ లలో జరగనున్న ఈ కార్యక్రమంలో పలు దేశాల్లోని ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. రేపు రెండో రోజు కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలను మోదీ ప్రకటించే అవకాశాలున్నాయి. ముగింపు సమావేశాలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరుకానున్నారు. ఇక ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా భారత సంతతికి చెందిన గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రవీంద్రనాథ్ రామోతార్ హాజరుకానున్నారు.