: సరికొత్త కనిష్ఠానికి ముడి చమురు... ఏడు రూపాయల వరకు తగ్గనున్న పెట్రోల్ ధర!


అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు మరింతగా దిగజారాయి. నిన్నటి సెషన్లో ఐదున్నరేండ్ల కనిష్ఠ స్థాయికి చేరి 50 డాలర్లకు చేరిన బ్యారల్ ముడి చమురు ధర నేడు మరో 2 డాలర్లు తగ్గి 47.95 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. మరోవైపు లండన్ కమోడిటీ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ కూడా 50 డాలర్ల స్థాయికి పడిపోయింది. దీంతో గత రెండు రోజుల్లో ముడిచమురు ధర 10 శాతం తగ్గినట్లయింది. దేశీయ ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతి చేసుకుంటున్న ఇండియాకు ఇది కలసివచ్చే అంశమే. ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ దఫా కనీసం రూ.7 వరకూ పెట్రోల్, రూ.6 వరకూ డీజిల్ ధర తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News