: అప్పు తీరుస్తావా?... అమ్మాయిని పంపుతావా?... వడ్డీ వ్యాపారి దాష్టీకం!
కేవలం రూ.5 వేల అప్పు తీసుకున్న నేరానికి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వడ్డీ వ్యాపారి. ఈ ఘటన అనంతపురంలో జరిగింది. ఆరోగ్య అవసరాల నిమిత్తం మల్లేశ్ అనే వ్యాపారి వద్ద ఓ మహిళ రూ.5 వేలు అప్పు తీసుకుంది. సకాలంలో అప్పు చెల్లించలేక పోవడంతో ఆ వ్యాపారి తన అసలు నైజాన్ని చూపటం మొదలుపెట్టాడు. ఆమె కూతురును తన వద్దకు పంపించాలని వేధింపులకు దిగాడు. దీంతో బాధిత మహిళ అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఆ మహిళకు మద్దతుగా విద్యార్థి సంఘాలు ధర్నా చేపట్టాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.