: చంద్రబాబు కాన్వాయ్ లో కొత్త వాహనాలు!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్ లో నేటి నుంచి కొత్త వాహనాలు కనిపించనున్నాయి. ఐదేళ్లుగా పాత వాహనాల కాన్వాయ్ తో పలు ఇబ్బందులు పడ్డ చంద్రబాబు ఇకపై కొత్తగా కొనుగోలు చేసిన టాటా సఫారీ వాహనాల్లో ఎలాంటి కుదుపులు లేకుండా ప్రయాణించనున్నారు. నిన్నటిదాకా చంద్రబాబు అంబాసిడర్ కార్లతో కూడిన కాన్వాయ్ లో తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా నేటి నుంచి ఆయన కాన్వాయ్ లో అంబాసిడర్ల స్థానంలో టాటా సఫారీలు చేరాయి. తొలి దశలో ఆరు వాహనాలు రాగా వాటికి కొద్దిసేపటి క్రితం ఖైరతాబాద్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. మరో రెండు వాహనాలు చంద్రబాబు కాన్వాయ్ లో చేరాల్సి ఉంది. బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి తుది మెరుగులు అద్దుతుండగా, మరో వాహనానికి జామర్లు అమర్చుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరో వారం, పది రోజుల్లో ఈ రెండు వాహనాలు కూడా చంద్రబాబు కాన్వాయ్ లో చేరనున్నాయి. నేడు విజయవాడ బయలుదేరుతున్న చంద్రబాబు, జూబ్లీ హిల్స్ లోని తన నివాసం నుంచి బేగంపేట విమానాశ్రయానికి కొత్త కాన్వాయ్ లోనే వెళ్లనున్నారు.