: విరాట్ ధోనీ... వేధింపులకు పాల్పడి తన్నులు తిన్నాడు!


పేరు విరాట్ ధోనీ. టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణం విరాట్ కోహ్లీ పేర్లను కలిపి పెట్టుకున్న అతడు పేరుకు తగ్గట్లు ప్రవర్తించలేదు. పాఠశాలకు వెళుతున్న బాలికలను వెకిలి చేష్టలతో వేధించాడు. ఆ తర్వాత నడిరోడ్డుపై ఒంగోని చెప్పు దెబ్బలు తిన్నాడు. మధ్యప్రదేశ్ లోని సెంధ్వాలో చోటుచేసుకున్న ఈ ఘటనలో పాఠశాల బాలికలను తన వెకిలి చేష్టలతో విరాట్ ధోనీ వేధింపులకు గురిచేశాడు. పోలీసులకు సమాచారం అందించిన బాలికలు, మహిళా పోలీసు అధికారి సమక్షంలో అతడిని నడిరోడ్డుపై ఒంగోబెట్టి మరీ చెప్పులతో కొట్టారు. అనంతరం అతడు తనకు జరిగిన అవమానాన్ని స్థానిక కోర్టు న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లాడు. అయితే బాలికలను బహిరంగ ప్రదేశంలో వేధింపులకు గురి చేసిన కారణంగా బహిరంగ శిక్ష సరైందేనని న్యాయమూర్తి తేల్చిచెప్పడంతో చేసేది లేక ఇంటిదారి పట్టాడు.

  • Loading...

More Telugu News