: సెల్పీకి స్పెషల్ కోర్సు
విద్యావ్యవస్థ కాలమాన పరిస్థితులను బట్టి రూపు మార్చుకుంటోంది. విలువల కోసం, విజ్ఞానం కోసం మొదలైన విద్యావిధానం, ధనార్జనే ధ్యేయంగా రూపాంతరం చెందింది. దీంతో లెక్కలేనన్ని కోర్సులు వస్తున్నాయి. లెక్కలేనంత మంది నిపుణులు వెలుగు చూస్తున్నారు. తాజాగా సెల్ఫీల మోజు మరో కోర్సుకి రూపకల్పన చేసింది. సెల్ఫీలు పదికాలాల పాటు పదిలంగా దాచుకోవాలి. అంటే సెల్ఫీలు నాణ్యంగా తీసుకోవాలి, అందులో నైపుణ్యం కావాలి. ఇలా ఆలోచించిందే తడవుగా లండన్ లోని సిటీ లిట్ అనే కళాశాల ఓ స్వల్పకాలిక సెల్ఫీ కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సు ఫీజును పదివేల రూపాయలుగా నిర్ణయించింది. కేవలం నెల రోజుల కోర్సులో ఫోటోగ్రఫీ నిపుణులతో క్లాసులు, చర్చలు నిర్వహిస్తారు. సెల్ఫీ తీసుకునే విధానం నేర్పిస్తారు. మంచి సెల్ఫీ తీయాలంటే మంచి వెలుతురు, సరైన యాంగిల్ అవసరమని, అది తెలుసుకోవాలంటే సెల్ఫీ కోర్సులో చేరాల్సిందేనని కళాశాల చెబుతోంది.