: సునంద పుష్కర్ కేసులో వెల్లడైన ఆసక్తికర విషయాలు
సునంద పుష్కర్ మరణాన్ని హత్యగా నిర్ధారించడంతో మరికొన్ని ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి. ఆమెపై ప్రయోగించిన విషాన్ని 'ఎయిమ్స్' వైద్య నిపుణులు పొలోనియం అని పేర్కొన్నారు. పొలోనియంను మేడం క్యూరీ దంపతులు 1898లో కనుగొన్నారు. ఇది అత్యంత విషపూరితమైన రేడియోధార్మిక పదార్థం. దీనిని గతంలో పాలస్తీనా అధ్యక్షుడు యాసిర్ అరాఫత్ ను చంపేందుకు వినియోగించినట్టు ఎన్నో కథనాలు వచ్చాయి. తాజాగా సునంద పుష్కర్ హత్యకు ఈ విషాన్నే వినియోగించినట్టు తెలుస్తోంది. పుష్కర్ మరణం తరువాత పోస్టుమార్టం కోసం శాంపిళ్లను విదేశాలకు కూడా పంపారు. పొలోనియం వాడిన విషయం అక్కడే నిర్ధారణ అయినట్టు తెలుస్తోంది. కాగా, అసలు ఆమెది హత్య అయితే ఇంత లేటుగా నిర్ధారించడానికి కారణాలు ఏంటి? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. మరి ఆమెను హత్య చేసింది ఎవరు? ఎందుకు హత్యచేశారు? ఆమెను హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అనే విషయాలను పోలీసులు తేల్చాల్సి ఉంది.