: గుజరాత్ లో అద్భుతం... నాలుగో అంతస్తు నుంచి పడినా బాలిక సేఫ్!


గుజరాత్ లో అద్భుతం జరిగింది. సాధారణంగా నాలుగో అంతస్తు నుంచి ఎవరైనా కిందపడితే ఏం జరుగుతుంది? ఎముకలు నుజ్జునుజ్జయిపోతాయి. నేలకు కొట్టుకుని తల పగిలిపోయి, ప్రాణాలు కోల్పోతారు. గుజరాత్ లోని ఓ పట్టణంలో నాలుగేళ్ల పాపాయి నాలుగో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడిపోయింది. అంతెత్తు నుంచి కింద పడిన బాలిక బంతిలా ఎగిరింది. ఈ విషయాలు సీసీ కెమెరా ఫుటేజ్ లో నమోదయ్యాయి. అయితే, అద్భుతం ఏంటంటే అంత ఎత్తునుంచి పడినా బాలిక ప్రాణాలు దక్కించుకుంది. బాలికకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయి. దీంతో, బాలికను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News