: ఓవైసీ సోదరులు హిందువులను కించపరచేలా మాట్లాడుతున్నారు: టీడీపీ నేత సోమిరెడ్డి
ఓవైసీ సోదరులు, ఎంఐఎం నేతలు హిందువులను కించపరచేలా మాట్లాడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్రు భవన్ లో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. హిందువులపై అలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మీకేమైనా విభేదాలుంటే ఆర్ఎస్ఎస్ ను విమర్శించుకోండని, అంతేగానీ హిందువులను విమర్శిస్తే చేతులు కట్టుకుని కూర్చోలేమని స్పష్టం చేశారు. ప్రస్తుత ఈ వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.