: చెంపదెబ్బ కొడితే హత్యాయత్నం కేసు పెట్టారు!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని చెంపదెబ్బ కొట్టిన దేబాశిష్ ఆచార్యపై హత్యాయత్నం సహా పలు అభియోగాలను పోలీసులు నమోదు చేశారు. ఆ ఘటన తరువాత కొందరు తృణమూల్ అభిమానులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఆచార్య ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆచార్య పరిస్థితి కుదుటపడితే అతడిని కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. ఆచార్యపై కార్యకర్తల గుంపు దాడి చేయడాన్ని మమత సర్కారు సమర్థించుకుంటోంది. ఆచార్యకు ఆర్ఎస్ఎస్ తో సంబంధాలున్నాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కాగా, ఆచార్యను క్షమించాలని, కార్యకర్తలు సంయమనం పాటించాలని అభిషేక్ బెనర్జీ కోరారు.