: బర్త్ డే బాయ్ ఏఆర్ రెహమాన్ కు విషెస్ వెల్లువ
విఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ 48వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎందరో ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. వారిలో సింగర్లే ఎక్కువమంది ఉన్నారు. 'గానకోకిల' లతా మంగేష్కర్, కవితా కృష్ణమూర్తి, ఆయుష్మాన్ ఖురానా, ప్రసేన్ జోషీ విషెస్ చెప్పిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారు రెహమాన్ సంగీతంలో పాడిన పాటలను గుర్తు చేసుకున్నారు. ఆయన గొప్పదనాన్ని ప్రస్తుతించారు. లతా మాట్లాడుతూ, అతను ఎంతో ప్రతిభావంతుడని కితాబిచ్చారు. రెహమాన్ స్వరకల్పన చేయగా తాను పాడిన 'జియా జలే' గీతమంటే ఎంతో ఇష్టమని తెలిపారు. రెహమాన్ ఓ లివింగ్ లెజెండ్ అంటూ గాయకనటుడు ఆయుష్మాన్ ఖురానా కీర్తించారు. అతను ఎన్నో తరాలు ముందున్నాడని పేర్కొన్నారు.