: నా భార్యకు చెందిన ఆస్తులేవీ తీసుకోలేదు: శశి థరూర్


తన భార్య సునంద పుష్కర్ కు చెందిన ఆస్తులను తీసుకోలేదని కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ కేరళ హైకోర్టుకు తెలిపారు. లోక్ సభ ఎన్నికల అఫిడవిట్లో తన భార్యవల్ల వచ్చిన ఆస్తులను థరూర్ వెల్లడించలేదన్న పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు. తన భార్య కెనడా పౌరురాలని, అందువల్ల హిందూ వారసత్వ చట్టాన్ని ఆమెకు వర్తింపజేయలేమని, తద్వారా ఆమె ఆస్తులను తాను పొందే అవకాశం లేదని ఆయన న్యాయస్థానానికి వివరించారు. తన భార్య స్థిర, చరాస్తులేంటన్నది ఇంతవరకు అంచనా వేయలేదని, ఆమె వారసత్వ హక్కులు ఎవరికి వెళతాయన్నది కూడా నిర్ధారించలేదని ఆయన న్యాయస్థానికి చెప్పారు. ఆమె మరణించిన కారణంగా తాను ఆమె ఆస్తులను వెల్లడించలేదని, వెల్లడించకపోవడం వెనుక ఎలాంటి దురాలోచన లేదని ఆయన కోర్టుకు విన్నవించారు. కాగా, సునంద పుష్కర్ విషప్రయోగంతోనే మరణించినట్టు ఢిల్లీ పోలీసులు నేడు నిర్ధారించారు.

  • Loading...

More Telugu News