: వెరీ సారీ... ఖాతాదారులకు క్షమాపణ చెప్పిన ట్విట్టర్
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్ ట్విట్టర్ తన ఖాతాదారులకు క్షమాపణలు చెప్పింది. నిన్న రెండు గంటల పాటు సాంకేతిక లోపం కారణంగా తమ సేవల్లో అంతరాయం ఏర్పడిందని, అందుకు వినియోగదారులు క్షమించాలని కోరింది. సోమవారం నాడు ట్విట్టర్ లో ఎవరైనా ట్వీట్ చేస్తే అది 25 నుంచి 45 నిమిషాల వరకు టైమ్ లైన్ పై ప్రత్యక్షం కాలేదు. వినియోగదారులకు అసౌకర్యం కలిగినందుకు ట్విట్టర్ తన వెబ్‌సైట్లో క్షమాపణలు కోరుతూ, లోపాన్ని సవరించామని వెల్లడించింది. ఇకపై ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని తెలిపింది.