: గాయపడిన అభిమాని శ్రీనివాస్ ను పరామర్శించిన పవన్
'గోపాల గోపాల' ఆడియో వేడుక సమయంలో కత్తిపోట్లకు గురై తీవ్రంగా గాయపడిన తన అభిమాని కరుణ శ్రీనివాస్ ను నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన అతడిని, కుటుంబ సభ్యులను ఈరోజు పార్టీ కార్యాలయానికి తీసుకువచ్చారు. కార్యాలయంలో వారిని కలసిన పవన్ దాదాపు గంటకు పైగా మాట్లాడారు. శ్రీనివాస్ వైద్యానికి అయ్యే ఖర్చులు గాకుండా, వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు ఈ సందర్భంగా పవన్ అందజేశారు. శ్రీనివాస్ భార్య, పిల్లలను కూడా పవన్ పలకరించి, వారితో ఫోటోలు దిగారు.