: నేను సెక్యులరిస్టును... కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు: మర్రి శశిధర్ రెడ్డి
సనత్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో బీజేపీలో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి ఖండించారు. ‘‘నేను సెక్యులరిస్టును. కాంగ్రెస్ ను వీడే ప్రసక్తే లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థిగా సనత్ నగర్ లో విజయం సాధించిన తలసాని శ్రీనివాసయాదవ్ ఇటీవల టీఆర్ఎస్ లో చేరారు. ఆ సందర్భంగా ఆయన తన శాసనసభ్యత్వానికి, టీడీపీకి రాజీనామా చేశారు. దీంతో, సనత్ నగర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. మారిన రాజకీయ పరిణామాలతో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నారంటూ వార్తలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, కొద్దిసేపటి క్రితం మీడియా ముందుకు వచ్చిన ఆయన ఆ వార్తలను ఖండించారు.