: 'పీకే' వ్యాజ్యంపై కేంద్ర ప్రభుత్వ స్పందన కోరిన అహ్మదాబాద్ హైకోర్టు
బాలీవుడ్ చిత్రం 'పీకే'ను బ్యాన్ చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై అలహాబాద్ హైకోర్టు కేంద్ర ప్రభుత్వ స్పందన కోరింది. వారంలోగా మీ సమాధానాన్ని న్యాయస్థానంలో సమర్పించాలని అడిగింది. హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ దాఖలు చేసిన పిల్ ఆధారంగా జస్టిస్ ఇంతియాజ్ ముర్తాజా, జస్టిస్ రితురాజ్ అవస్తీల నేతృత్వంలోని లక్నో బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన యు/ఏ సర్టిఫికెట్ ను కూడా తిరస్కరించేలా ఆదేశాలు ఇవ్వాలని వ్యాజ్యంలో కోరారు.