: మరింత భీకరంగా విరుచుకుపడతాం: తాలిబన్లు


పెషావర్ దాడి కంటే మరింత భీకరస్థాయిలో విరుచుకుపడతామని పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-తాలిబన్ సంస్థ ప్రకటించింది. తాలిబన్ చీఫ్ మౌలానా ఫజులుల్లా పేరిట ఈ మేరకు ఓ వీడియో ప్రకటన విడుదలైంది. పెషావర్ సైనిక పాఠశాలపై దాడిచేసి 132 మంది అమాయక విద్యార్థులను బలిగొనడాన్ని ఫజులుల్లా సమర్థించుకున్నారు. మరింత మంది పిల్లలను చంపుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. సైనిక చర్యకు ప్రతిగానే పెషావర్ సైనిక పాఠశాలపై దాడి చేశామని, అక్కడ తాము చంపింది సైనికుల పిల్లలనే అని స్పష్టం చేశారు. సాధారణ పౌరుల పిల్లలను ఎవరినీ చంపలేదని తెలిపారు. వారు ఎవరి పిల్లలో అడిగిన తర్వాత కాల్పులు జరిపామని చెప్పారు. ప్రస్తుతం తాము సైన్యంతో యుద్ధం చేస్తున్నామని అన్నారు. సైన్యం బూటకపు ఎన్ కౌంటర్లలో తమను, తమకు చెందిన వారిని చంపితే, తాము కూడా సైనికులను చంపుతామని ప్రకటనలో పేర్కొన్నారు. వారిని వీధులు, మార్కెట్లు... ఇలా ఎక్కడైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News