: పద్మభూషణ్ కోసం రచ్చకెక్కిన మరో అథ్లెట్


తననెందుకు పద్మభూషణ్ అవార్డుకు సిఫారసు చేయలేదంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ బహిరంగంగా డిమాండ్ చేయడం మరో క్రీడాకారుడికి అలుసిచ్చినట్టైంది. తన పేరును కూడా పద్మభూషణ్ పురస్కారానికి సిఫారసు చేయాలని బాక్సర్ విజేందర్ సింగ్ అడుగుతున్నాడు. "పద్మ భూషణ్ అవార్డు కోసం నా పేరు కూడా కేంద్ర క్రీడా శాఖకు సిఫారసు చేయాలని బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిని కోరాను" అని విజేందర్ తెలిపాడు. మరి దీనిపై కేంద్ర క్రీడా శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి. 2008 ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన విజేందర్ ను 2010లో పద్మశ్రీ అవార్డుతో కేంద్రం సన్మానించింది.

  • Loading...

More Telugu News