: ఢిల్లీలో స్మృతి ఇరానీ అధ్యక్షతన రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశం
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఇతర రాష్ట్రాల మంత్రులతో పాటు ఏపీ, తెలంగాణ విద్యా శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీష్ రెడ్డి కూడా సమావేశంలో పాల్గొన్నారు. విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. కాగా, ఎంసెట్ వివాదంపై రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న అంశాన్ని మంత్రి స్మృతి దృష్టికి కూడా మంత్రులు తీసుకువెళ్లనున్నారు.