: నిబంధనలు అతిక్రమించలేదు... ఎంసెట్ మేమే నిర్వహిస్తాం: టీ విద్యా మంత్రి


తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలను అతిక్రమించలేదని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. విద్యాశాఖ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడి విలేకరులతో మాట్లాడుతూ, తమపై ఏపీ సర్కారు చేస్తున్న వాదనలో వాస్తవం లేదని చెప్పారు. విభజన చట్టం ప్రకారం ఎంసెట్ నిర్వహించే హక్కు తమకే ఉందని ఆయన ప్రకటించారు. ఎంసెట్ వివాదంపై ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన, నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని తెలిపారు. అసలు తమను సంప్రదించకుండానే ఏపీ సర్కారు ఎంసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసిందన్నారు.

  • Loading...

More Telugu News