: సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సుబ్రహ్మణ్యస్వామి
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బద్ధ శత్రువు, ఎల్లప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జయ అక్రమాస్తుల కేసులో తాను వాదించాలనుకుంటున్నానని... వాదనలకు అనుమతించాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు... హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని సుబ్రహ్మణ్యస్వామికి సూచించింది. జయ అక్రమాస్తులకు సంబంధించి మొదట ఫిర్యాదు చేసింది సుబ్రహ్మణ్యస్వామే అన్న సంగతి తెలిసిందే.