: టీ మంత్రి పద్మారావు ఇంటి వద్ద ఉద్రిక్తత: ఫీజుల కోసం విద్యార్థుల ఆందోళన, అరెస్ట్
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల విడుదల, ఫాస్ట్ పథకం విధివిధానాల ప్రకటనను డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘం పీడీఎస్ యూ నేతలు తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి పద్మారావు ఇంటిని ముట్టడించే యత్నం చేశారు. ఈ సందర్భంగా తమను అడ్డుకున్న పోలీసులను విద్యార్థి సంఘం నేతలు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి ఇంటి ముట్టడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన విద్యార్థులను నిలువరించడం అక్కడున్న అతికొద్ది మంది పోలీసులకు సాధ్యం కాలేదు. మరిన్ని అదనపు బలగాలను పిలిపించుకున్న పోలీసులు ఎట్టకేలకు విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.