: మహారాష్ట్ర నుంచి ముంబయ్ ను ఎవరూ వేరుచేయలేరు: శివసేన


మహారాష్ట్రలో ముంబయ్ నగరం ఓ భాగంగానే ఉంటుందంటూ శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే పునరుద్ఘాటించారు. రాష్ట్రం నుంచి ఆ నగరాన్ని వేరు చేసే ధైర్యం ఎవరికీ లేదన్నారు. మరాఠీ చిత్రం 'బల్ కదు'కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, "మహారాష్ట్రలో శివసేన లేకుంటే, రాష్ట్రంలో ముంబయ్ ఓ భాగంగా ఉండలేదు. చాలాకాలం కిందటే రాష్ట్ర విభజనయ్యేది. కానీ ఇప్పుడు రాష్ట్రం నుంచి ముంబయ్ నగరాన్ని తీసుకెళ్లే ధైర్యం ఎవరికీ లేదు" అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల మనసుల్లో ఏముందో సేన అదే ఆలోచన చేస్తుందని, తాము లేకుంటే రాష్ట్రంలో అస్థిరత ఏర్పడుతుందని అన్నారు. కాబట్టి ప్రజలందరూ కలిసే ఉండాలని థాకరే సూచించారు.

  • Loading...

More Telugu News