: ఏవోబీలో టెన్షన్: పోలీసుల కూంబింగ్ తో బిక్కుబిక్కుమంటున్న గిరిజనం
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో నేటి ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖమ్మం జిల్లా వాజేడు మండలం టేకూలగూడెంలో గతరాత్రి మావోయిస్టులు ఓ కాంట్రాక్టర్ కు చెందిన టిప్పర్లు, జేసీబీకి నిప్పంటించారు. దీంతో మావోల కోసం పోలీసులు కూంబింగును ముమ్మరం చేశారు. మరోవైపు ఒడిశాలోని మల్కన్ గిరి జిల్లా బెజ్జంకి పరిసరాల్లో పోలీసులు, మావోల మధ్య కాల్పుల నేపథ్యంలో అటు వైపు నుంచి కూడా పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. రెండు వైపుల నుంచి పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండటంతో అక్కడి గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.