: రోడ్లపై పరుగులు పెట్టనున్న 'తెలుగు వెలుగు' బస్సులు


మారుమూల పల్లెల్లోని ప్రజల ప్రధాన రవాణా వాహనంగా ఉన్న 'పల్లె వెలుగు' బస్సులను 'తెలుగు వెలుగు' బస్సులుగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్ధా రాఘవరావు తెలియజేశారు. బస్సుల రంగు మార్పుపై మాట్లాడే అర్హత ప్రతిపక్షాలకు లేదని ఆయన విమర్శించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆర్టీసీ నడిపే ప్రత్యేక బస్సుల్లో అధిక ఛార్జీలుండవని ఆయన స్పష్టం చేశారు. అధిక ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. రిపబ్లిక్ దినోత్సవం నాడు విజయవాడలో ముఖ్యమంత్రి 100 కొత్త బస్సులను ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.

  • Loading...

More Telugu News