: పవన్ అభిమాని గొంతు కోసిన దుండుగుల ఫొటోల విడుదల


రెండు రోజుల క్రితం ‘గోపాల గోపాల’ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ అభిమాని కరుణ శ్రీనివాస్‌ గొంతు కోసిన దుండగుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. మాదాపూర్‌ లోని శిల్పకళా వేదిక ఆవరణలో బ్లేడ్ పట్టుకు తిరుగుతున్న వ్యక్తి చిత్రాన్ని మీడియాకు అందించిన పోలీసులు అతని ఆచూకీ తెలిస్తే, 9493549415, 9491030063 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. దాడి జరుగుతున్నప్పుడు పవన్ అభిమానులు సెల్‌ ఫోన్‌ లో తీసిన ఫొటోలను సేకరించిన పోలీసులు త్వరలోనే దుండగులను అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. కాగా, దాడిలో గాయపడ్డ శ్రీనివాస్‌ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడని పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News