: సీవీఆర్ న్యూస్ ఛానెల్ యజమానిపై భూకబ్జా కేసు!
తెలుగు న్యూస్ ఛానెల్ ‘సీవీఆర్’ యజమాని సీవీ రావుపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో భూకబ్జా కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ లోని ప్రశాసన్ నగర్ కు చెందిన శ్రీదేవి అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో కోర్టు ఆదేశాలతో ఈ కేసు నమోదైంది. నకిలీ దస్తావేజులు ఉపయోగించి జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 22లోని తనకు చెందిన 3 వేల చదరపు గజాల భూమిని సీవీ రావు కుమార్తె దీపకు చెందినదిగా రికార్డులను సృష్టించారని శ్రీదేవి తన పిటిషన్ లో కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును పరిశీలించిన కోర్టు, సీవీ రావుపై కేసు నమోదు చేయాలని జూబ్లీహిల్స్ పోలీసులను ఆదేశించింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.