: సెంచరీ చేసి ఔట్ అయిన వార్నర్... ఆసీస్ 200/1
సిడ్నీలో భారత్ తో జరుగుతున్న చివరి టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 16 ఫోర్ల సహాయంతో మరో సెంచరీ చేశాడు. 101 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్ లో మురళీ విజయ్ కు క్యాచ్ ఇచ్చి వార్నర్ పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ రోజర్స్ (91) కూడా ధాటిగా ఆడుతున్నాడు. రోజర్స్ కు షేన్ వాట్సన్ జత కలిశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 200 పరుగులు.