: రెండేళ్ల తర్వాత నేనే సీఎం: రాజధాని రైతులతో వైఎస్ జగన్


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల తర్వాత ఏపీకి తానే సీఎం నవుతానంటూ ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబునాయుడి అధికారం కేవలం రెండేళ్లేనని చెప్పిన ఆయన ఆ తర్వాత పాలన పగ్గాలు తానే చేేపడతానంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు జ్యోతిష్యులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారని ఆయన అన్నారు. నవ్యాంధ్ర రాజధాని రైతులతో సోమవారం భేటీ అయిన సందర్భంగా జగన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘‘చంద్రబాబునాయుడు అధికారం ఉంది కదా అని చెప్పి తన ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు. కానీ ఈ అధికారం ఉండేది రెండు సంవత్సరాలే. జ్యోతిష్యులు కూడా ఇదే చెబుతున్నారు. ఒకవేళ దేవుడు అనుకూలిస్తే నాలుగేళ్లు ఉండొచ్చు. ఏం చేసినా ఆ అధికారం పోయేలోపే. మీకందరికీ అంగీకారమైతేనే భూములు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే చంద్రబాబు కాదుగదా... వాళ్ల నాయన వచ్చినా కూడా తీసుకోలేడు. మీ కొడుకు, మీ అన్న, మీ తమ్ముడు లాంటి నేనే సీఎంనవుతా’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News