: ఒంగోలులో బ్యాంకు ఖాతా... లండన్ లో రూ.75 లక్షలు మాయం!


బ్యాంకింగ్ మాయల్లో సరికొత్త తరహా మోసం వెలుగు చూసింది. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన బ్యాంక్ అకౌంట్ లండన్ లో హ్యాకింగ్ కు గురైంది. దీంతో హ్యాకర్లు సదరు బ్యాంకు ఖాతా నుంచి దాదాపు రూ.75 లక్షల మేర డబ్బును ఎగరేసుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణకు శ్రీకారం చుట్టారు. వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలుకు చెందిన గ్రానైట్ వ్యాపారి చల్లా శ్రీనివాసరావుకు చెందిన బ్యాంకు ఖాతాలో భారీ ఎత్తున డబ్బు మాయమైంది. విషయాన్ని తెలుసుకున్న సదరు శ్రీనివాసరావు మాయమైన మొత్తాన్ని చూసి కంగుతిన్నారు. తన బ్యాంకు ఖాతా హ్యాకింగ్ కు గురైందని తేల్చుకున్నారు. లండన్ నుంచి చక్రం తిప్పిన హ్యాకర్లు తన ఖాతా నుంచి దాదాపు 1.25 లక్షల డాలర్లను మాయం చేశారని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైనాకు చెందిన ఓ కంపెనీ తన ఖాతాలో జమ అయిన మొత్తాన్ని హ్యాకర్లు కాజేశారని ఆయన ఒంగోలు టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News