: ఏటీఎం తెరుచుకోలేదని ఏటీఎంనే లేపేశారు


రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలోని దంతిల్ గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ కు చెందిన ఏటీఎంను పగులగొట్టేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. ఏటీఎం ఎంతకూ తెరుచుకోకపోవడంతో, దుండగులు ఏకంగా ఏటీఎం మిషన్ నే లేపేసిన సంఘటన చోటుచేసుకుంది. దుండగులు ఎత్తుకెళ్లిపోయిన ఏటీఎంలో 12.80 లక్షల రూపాయలు ఉన్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. జరిగిన దానిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News