: ఐర్లాండ్ వరల్డ్ కప్ జట్టు ఇదే


న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 2015 ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీలో పాల్గొనే ఐర్లాండ్ జట్టును ఆ దేశ సెలెక్టర్లు ప్రకటించారు. గత నెలలో దుబాయ్ లో ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్ జట్లతో జరిగిన ముక్కోణపు సిరీస్ లో ఆడిన జట్టునే వరల్డ్ కప్ కు కూడా కొనసాగించడం విశేషం. విలియం పోర్టర్ ఫీల్డ్ నేతృత్వంలో వరల్డ్ కప్ ఆడనున్న జట్టులో పోర్టర్ ఫీల్డ్ తో పాటు కెవిన్ ఓబ్రియాన్, నీల్ ఓబ్రియాన్, ఎడ్ జాయెన్, జాన్ మూనేలకు ఇది మూడో వరల్డ్ కప్. కాగా, ఐర్లాండ్ వరల్డ్ కప్ జట్టులో సభ్యుల వివరాలు... విలియం పోర్టర్ ఫీల్డ్ (కెప్టెన్), ఆండ్రూ బాల్ బిర్నీ, పీటర్ ఛాసే, అలెక్స్ కుసాక్, జార్జ్ ఎడ్ జాయ్ న్, ఆండ్రూ మెక్ బ్రెయిన్, జాన్ మూనే, టీమ్ ముర్తాగ్, కెవిన్ ఓబ్రియాన్, నీల్ ఓబ్రియాన్, పాల్ స్టిర్లింగ్, స్టువార్ట్ థాంప్సన్, గ్యారీ విల్సన్, క్రేగ్ యంగ్.

  • Loading...

More Telugu News